Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ సి (కావేరి) హాస్టల్ మెస్‌లో టిఫిన్ చేస్తుండగా చంద్రగిరి నరేష్ విద్యార్థి భుజంపై పెచ్చులు ఊడిపడ్డాయి. విద్యార్థికి ప్రమాదం తప్పడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చీఫ్ వార్డెన్ కోరెముల.శ్రీనివాసరావు, అడిషినల్ చీఫ్ వార్డెన్ డా.లక్ష్మారెడ్డి బీ, సీ హాస్టల్ మెస్‌లలో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఊడుతున్న, పెచ్చులు పరిశీలించి మెస్ పరిసరాల్లో శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. మెస్ మిద్దెలపై వర్షపునీరు నిల్వకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. సీజన్ మారిన నేపథ్యంలో విద్యార్థులకు వడ్డించే ఆహారం శుచిగా అందించాలని సూచించారు. మరోవైపు వర్షాకాలం నేపథ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోమోనని మెస్‌కు భయభయంగా వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే సి వసతిగృహంలో రెండుసార్లు పెచ్చులు ఊడిన పడి ప్రమాదం తప్పిన విషయం తెల్సిందే.