Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఈనెల 24న అంబర్పేట నియోజకవర్గంలో జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం కార్పొరేటర్లు విజరు కుమార్ గౌడ్, పద్మావెంకట్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తీ చేయాలన్నారు. అమ్మవారి ఊరేగింపు రథం వచ్చే మార్గంలో, ఆలయాల వద్ద, బోనాలు తీసుకువచ్చే మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి రోడ్డు మరమ్మతులు, డ్రయినేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, నేమూరి సాంబశివ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు సత్తిబాబు గౌడ్, సభ్యులు మోర శ్రీరాములు ముదిరాజ్, మహేందర్ రెడ్డి, గడ్డ శ్రీధర్ గౌడ్, చంద్రశేఖర్, సుధాకర్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.