Authorization
Sat March 15, 2025 07:49:40 pm
- తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె శశి శ్రీ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఈనెల 23న విద్యార్థినిలకు గైనకాలజీ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె శశి శ్రీ తెలిపారు. మంగళవారం కోఠిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోఠి ఉమెన్స్ కళాశాలలో జులై 23న విద్యార్థులకు గైనకాలజీ సమస్యలపై, ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులు మానసిక సమస్యలు, ఒత్తిడి అధిగమించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సదస్సుకు గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణ శ్రీ, ప్రముఖ సైకాలజిస్ట్ వీరభద్రరావు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా టి విజయ నిర్మల, ఆర్గనైజ్ సెక్రెటరీ కల్పన తదితరులు పాల్గొన్నారు.