Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే హక్కు ప్రతి భారతీయుడిపై ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం నర్సింగ్ రావు అన్నారు. 'సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్' నినాదంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అగ్నిపథ్, సీఏఏ వంటి అనేక ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం నాగరాజ్, జేఎల్ సురేష్ కుమార్, రాజేందర్ వాల్మీకం, జి శేఖర్, ఎం రఘువీర్, బీఏ పవన్ కుమార్, నల్ల విల్సన్ తదితరులు పాల్గొన్నారు.