Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి
నవతెలంగాణ-బంజారాహిల్స్
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పెడమర్తి రవి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేండ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహించాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు. జనాభా ప్రతిపాదన ప్రకారమే ప్రజలకు రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు విడుదల చేస్తారని అవి చేపట్టకపోవడం వల్ల దేశంలో నేడు నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అభివద్ధి కుంటుపడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021లో జనాభా లెక్కలు చేయలేనందున తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రిజర్వేషన్లు చేపట్టాలని సూచించారు. 2014లోనే మాదిగ ఉప సంఘాలు జనాభా 17.4%గా ఉందని, ప్రస్తుతం అది 18 శాతానికి తగ్గకుండానే ఉంటుందని అంచనా వేశారు. మాదిగ సంఘాలన్నీ ఏకతాటిపైకి ఆగస్టు 8,9వ తేదీల్లో ఢిల్లీ చేరుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇటుక రాజయ్య, మహా ఎమ్మార్పీఎస్ కె ప్రభాకర్రావ్, కె మల్లికార్జున్ పాల్గొన్నారు.