Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బోనాల పండుగ సమీపిస్తుందని డివిజన్ పరిధిలోని రోడ్లకు చేపడుతున్న ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అధికారులకు సూచించారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్లోని ప్రేమ్‌నగర్, అన్నపూర్ణనగర్, పటేల్‌నగర్ బిస్మిల్లా హోటల్ లేన్ ప్రాంతాలలో చేపడుతున్న రోడ్ల ప్యాక్ వర్క్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఏఈ కుషాల్, వర్క్ఇన్స్పెక్టర్ దుర్గ, స్థానిక బస్తీ ప్రజలు నరసింహ, శశిధర్, గణేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగారావు, మహేష్ ముదిరాజ్, వేణు, దేవి, శ్యాంసుందర్, సంతోష్‌చారి పాల్గొన్నారు.
తాగునీటి పైప్ లైన్ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఉన్నారు. మంగళవారం హిమాయత్ నగర్ డివిజన్ మహబూబా కాలేజ్ లైన్లో తాగునీటి వాటర్ లైన్ లీకేజీ పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కార దిశగా కషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింగ్ గౌడ్, మహేష్, వీరు నాయక్, స్థానిక జలమండలి అధికారులు పాల్గొన్నారు.