Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. గురువారం సీతాఫల్మండి డివిజన్ వారాసిగూడలో జనహిత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏండ్లుగా పేదలకు నిరంతర వైద్యం, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్న జనహిత సేవా ట్రస్ట్ వారిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇక ముందు కూడా కొనసాగిస్తూ నిరుపేదలకు చేయూతగా ఉండాలని కోరారు. ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, డాక్టర్ శరత్ యాదవ్, ఆర్వీ రమణ పాల్గొన్నారు.