Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఆలయాలకు ప్రభుత్వ నిధులు
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
జంటనగరాల్లో బోనాల వేడుకలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం సీతాఫల్మండీలోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని 185 ఆలయాల నిర్వాహకులకు బోనాల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ జులై 24, 25 తేదీల్లో జంటనగరాల్లోని వివిధ ఆలయాల్లో బోనాలు జరుగుతాయని తెలిపారు. పండుగ రోజుల్లో పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లలో లోపాలు ఉండకుండా జాగ్రతలు పాటించాలని సూచించారు. ఆలయాల వద్ద రద్దీ దష్ట్యా పోలీసులు తగిన భద్రత కల్పించాలని, మహిళలు, వద్ధులు, పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, పార్టీలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టంట్ కమీషనర్ కష్ణ, చిలకలగుడా ఇన్స్పెక్టర్ నరేష్, టీఆర్ఎస్ యువ నేతలు కిశోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, సునీల్ ముదిరాజ్, వంజరి. ముత్తయ్య, శ్రీనివాస్ గౌడ్, వివిధ సంస్థల ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.