Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిత బోడుప్పల్‌కు అధిక ప్రధాన్యత
- బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
వ్యర్థాల నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించి ఇంట్లోని చెత్తను తడిపోడి చెత్తగా వేరు చేసేలా ప్రయత్నం చేస్తామని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు.గురువారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిపి తీర్మానాలు చేశారు. కార్పొరేషన్ పరిధిలో 2022-2023 ఏడాదికి గాను హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ (ఎంఎల్ఎపీ), పట్టణ ప్రకతి వనాలు, హోమ్ స్టేడ్,సెంట్రల్ మీడియన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ మరియు నిర్వహణ ఖర్చులను కలిపి గ్రీన్ బడ్జెట్ కింద రూ.5 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. అదే విదంగా చెత్తను ఇంటి వద్దే తడిపొడి చెత్తగా వేరు చేయాడం కోసం ఐటీసీ కంపెనీ ప్రతినిధులతో కార్పొరేషన్ పరిధిలోని కొన్ని కాలనీలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతామని పేర్కొన్నారు. అందులో భాగంగా హేమనగర్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదే విధంగా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను '' చైన్ లింక్'' ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి ఐదు చోట్లకు కలిపి పది లక్షల రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ కమిషనర్ కె.పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్మ్షీగౌడ్, ఈఈ భద్రయ్య, డీఈఈ శ్రీలత,కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మంచి నీటి సరఫరాపై కార్పొరేటర్ల ఫిర్యాదు....బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 10,11, 22 డివిజన్లలో తాగునీటి సరఫరాలో కలుగుతున్న సమస్యలపై కార్పొరేటర్లు బొమ్మకు సుగుణ బాలయ్య, కొత్త శ్రీవిద్య చక్రపాణి, దొంతరబోయిన మహేశ్వరి కపాసాగర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెలుగు గుట్ట నుండి నీటి సరఫరా చేస్తుండటంతో ప్రెజర్ తగ్గుతూ నీటి సరఫరా జరుగుతుందని వాపోయారు ఒకనోక సమయంలో నీటి సరఫరాలో తమ డివిజన్ ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై కౌన్సిల్ సమా వేశాన్ని బహిష్కరించేందు సిద్దం కాగ మేయర్ కలుగ చేసుకోని సముదాయించినట్టు సమాచారం.