Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తుపాకీతో కాల్చుకొని లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి గతంలో మిల్ట్రీ జవాన్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని తిరిగి బయటకు రాలేదు. సోదరి ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ఇన్స్పెక్టర్ సంజరు కుమార్, ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. శివారెడి తన లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.