Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హబ్సిగూడ షోరూంలో శుక్రవారం సాయంత్రం 'ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో' కస్టమర్లను స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలు ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవని జ్యువెలరీ షాప్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం 'మైన్' ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం, 'ఎరా' అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ఠ శ్రేణి, 'ప్రెష్యా జాతిరత్నాభరణాల సముదాయం, ఎత్నిక్స్ హస్తకళా నైపుణ్యంతో తయారైన ఆభరణాలు, 'జిల్' అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయని చెప్పారు. 'డివైన్' భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం 'స్టార్లెట్' పిల్లల ఆభరణాలు ఈ ప్రదర్శననలో ఉంచారు. ఈ జ్యువెలరీ షో జులై 22 నుంచి జులై 25 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 22 కారెట్ల పాత బంగారం మార్పిడిపై 0% తగ్గింపును ఉంటుందని చెప్పారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల విక్రయ, వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటూ ఇండియా, సింగపూర్, జీసీసీ, యూఎస్ఏ దేశాలలో 280కి పైగా షోరూంలతో విస్తరించుకొని ముందుకు సాగుతుందని స్టోర్ హెడ్ అహ్మద్ సోఫీ వివరించారు. కార్యక్రమంలో మహిళ కస్టమర్స్, శ్రేయోభిలాషులు, ఉద్యోగులు పాల్గొన్నారు.