Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
జులై 24, 25 తేదీల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా డిడి కాలనీలోని ఉస్మానియా గేట్‌ను తెరవాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం
ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోనాల పండుగ సందర్బంగా జులై 24, 25 తేదీల్లో ఓయూ మోహిని చెరువు కట్ట మైసమ్మ, మల్లికార్జున్‌నగర్, డి.డి కాలనీ, ఇంద్రప్రస్తకాలనీ, సీఈ కాలనీ, ఎస్బీఐ కాలనీల నుంచి అనేకమంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, వారి సౌకర్యార్థం మైసమ్మ ఆలయానికి వెళ్లే డిడి కాలనీ రోడ్డులో ఉన్న గేట్‌ను ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు తెరిచి ఉంచాలని కోరారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకట్‌రెడ్డి, బాగ్ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, నాయకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.