Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆషాడమాసం బోనాల సందర్భంగా అన్ని ఆలయాలకు నిధులు అందజేస్తామని, ఏ ఒక్కరు నిరాశ చెందవద్దని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లేవ్యూవ్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వెంకటేశ్వర డివిజన్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి, హిమాయత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌లతో కలిసి ఆలయకమిటీ నిర్వాహకులకు 88 చెక్కులు అందజేశారు. ప్రతి ఏటా బోనాల పండుగకు 107 నుంచి 110 వరకు చెక్కులు అందించే ప్రభుత్వం ఈసారి మాత్రం 88 చెక్కులను మాత్రమే అందజేయడం విశేషం. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు జైరాం, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈఈలు ఇందిర, విజయ్ కుమార్, వాటర్ బోర్డు బీజీఎం శ్రీనివాస్, విద్యుత్ ఏడీ హైమనంద్, వివిధ అధికారులు సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.