Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపడుతుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు జీఎస్టీ, అధిక ధరలతో సామాన్య ప్రజల నడ్డివిరిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణను దశల వారీగా అభివద్ధి చేసుకోని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్మ్షీ గౌడ్, పీర్జాదిగూడ కమిషనర్ డా. పి. రామకష్ణ రావు, జంట కార్పొరేషన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.