Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పార్టీ 19వ డివిజన్ ఇన్చార్జ్ బొమ్మకు విశ్వనాథ్
నవతెలంగాణ-బోడుప్పల్
సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఆర్ఎస్ పార్టీ 19వ డివిజన్ ఇన్చార్జ్ బొమ్మకు విశ్వనాథ్ అన్నారు. ఆదివారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ భవాని కాలనీ మరియు ఈస్ట్ బందావన్ కాలనీ జెజీఆర్ స్కూల్ పరిధిలో సీసీ కెమెరాలను బొమ్మకు విశ్వనాథ్ తన సొంత నిధులతో (సుమారు రెండు లక్షల) సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ నేడు మారిన పరిస్థితులలో నేరాలను నియంత్రించేందుకు గాను నిఘా నేత్రాలు చాలా అనవసరమని అందుకే ప్రతి ఇంటికి, కాలనీకి సీసీ టీవీ కెమరాలు అమర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జెజీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగారాజు, టీఆర్ఎస్ నాయకులు రత్నం, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు తాజద్దీన్, సంజీవ, కిరణ్ కుమార్, గిరి, జాలిల్ హమ్మద్, మహమ్మద్ నాసిర్, మహమ్మద్ కదిర్, నరేందర్ గుప్తా, మహమ్మద్ ఖాజా, కుమార్ స్వామి మరియు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.