Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బ్రాహ్మణ సమాజాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్ని ఆలయాలకు బడ్జెట్ ఇస్తూ పండుగలను ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి సమాన ప్రాతిపదికన అండగా ఉంటున్నారన్నారు. బ్రాహ్మణ సమాజం కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి తద్వారా రుణాలు ఇస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారన్నారని చెప్పారు. అన్ని కులాల వారిలాగే బ్రాహ్మణులకు వట్టి నాగులపల్లిలో ఆరు ఎకరాలు భూమి ఇచ్చి రూ. 17కోట్లతో ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ఆలయాల్లో నిత్యం దూప దీప, నైవేద్యాలు జరిగేలా 3600 ఆలయాలకు రూ. 27 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు, మరో 2800 ఆలయాల్లో రూ. 20 కోట్లు కావాలని ప్రతిపాదనలు రాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మంజూరు ఇచ్చారన్నారు. యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సమావేశంలో నాయకులు అధికార ప్రతినిధి వేణుగోపాల చారి, ఎమ్మెల్సీ వాణి దేవి, ఆయాచితం శ్రీధర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, రాఘవ రావు, ప్రమోద్ పాల్గొన్నారు.