Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ సంతోష్ కుమార్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
పచ్చదనమే ప్రకృతికి శ్రీరామ రక్ష అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. తెలంగాణ ఐకాన్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 10 పంచవటి కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ చెట్లు మనుషుల ఆత్మకు శాంతినిస్తాయన్నారు. ఈకార్యక్రమం చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లీషు సాహిత్యంలో చెట్లు వాటి వేర్లు మానవ ఎదుగుదలను, మనిషి తన మూలాలను మరిచిపోవద్దనే మూల సూత్రాన్ని వివరిస్తుంటాయని.. అందుకే మనిషి తన ఎదుగుదలను మొక్కలతో పోల్చుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఐదేండ్ల హైదరాబాద్ వచ్చినప్పటి వాతావరణానికి ఇప్పటి హైదరాబాద్‌కు చాలా మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తనకు పచ్చదనం పరుచుకున్నట్లు కనిపిస్తోందని ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కొవిడ్ వారియర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హదయపూర్వక కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఆర్డినేటర్ రాఘవ, వెంకటేశ్వర కాలనీ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్ పాల్గొన్నారు.