Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ లను ప్రయోగించడం అత్యంత దారుణమని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్ ఆరోపించారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాషాయ రాజకీయాలకు వాడుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. బీజేపీ పాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ విభాగాలను జీవన రంగాలను అంబానీ, హిందూ కార్పొరేట్ వర్గాలకు అమ్మేసి మోడీ, అమిత్ షా ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయ పార్టీలు తమ గళాన్ని వినిపించకుండా నిరోధించే భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీ నేతల మీద వాడుతుందని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ చేత మానసిక వేధింపులు చేయడం అత్యంత హేయమని చర్యగా అభివర్ణించారు. దేశ ప్రజల మనోభావాలను జీవన రంగాలపై నిత్యావసర వస్తువులు, వరి, గోధుమ, పాలు, పెరుగు, ఆహారం తదితర నిత్యవసర వస్తువులపై తొమ్మిది శాతం జీఎస్టీ పన్ను విధించడం దారుణమన్నారు. చివరికి చనిపోయిన శవంపై 18 శాతం జీఎస్టీ పన్నులు విధించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ రాజ్యాంగ చట్టబద్దమైన పాలన చేయడం లేదని, మనుస్మతి ఆధారంగా పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. దేశ భవిష్యత్తును దెబ్బ తీస్తున్న బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల దేశ భూమిపుత్రులు, దళిత, బహుజన ప్రజలకు భవిష్యత్తు లేదన్నారు. ఇలాంటి దహనీయ పరిస్థితుల్లో దేశం ఉండటం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన చర్య అన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం, భారత రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పౌర, మానవహక్కులను రక్షించుకోవడం కోసం శ్రీలంక తరహాలో ఇండియా బీజేపీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ మనువాదుల దోపిడీదారులపై తిరుగుబాటు చేయకపోతే మనకు భవిష్యత్తు లేదని సూచించారు. సమావేశంలో దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేదవ్రత్, ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరి వసంతరావు, అధికార ప్రతినిధి దేవుని శ్రీనివాస్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇటిక్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.