Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 బీసీ సంఘాల డిమాండ్
నవతెలంగాణ-అడిక్మెట్
జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలను బీసీ గురుకులాలుగా మార్చాలని 14 బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్లో 14 బీసీ సంఘాల నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు అని మాత్రమే పిలుస్తున్నారని, అందులో ఉన్న బీసీ పదం కనిపించకుండాపోతుందన్నారు.. దీంతో ప్రధానంగా ఉండాల్సిన 'బీసీ' పదం వాడుకలో లేకుండా పోతుందన్నారు. తద్వారా బీసీలకు గురుకుల పాఠశాలలు లేవనే అసంతప్తి ఏర్పడుతుందన్నారు. 'మహాత్మా జ్యోతిరావు పూలేకు ఎవరూ వ్యతిరేకించడం లేదు. గొప్ప సంస్కర్తగా విగ్రహాలు పెడదాం-జయంతి ఉత్సవాలు జరుపుదాం. కానీ బీసీ పదం లేకుండా చేసే కుట్రలను వ్యతిరేకిద్దాం' అని బీసీ నాయకులు వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కులాలకు వారి కులాల పేరుపైనే గురుకులాలు ఉన్నాయని గుర్తుచేశారు. బీసీల అస్తిత్వం, ఉనికికి దెబ్బతినకుండా బీసీ గురుకుల పాఠశాలలని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, జనరల్ సెక్రెటరీ కోలా జనార్దన్, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేష్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపెల్లి అంజి, పధాన కార్యదర్శి వేముల రామకష్ణ, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి ముదిరాజ్, రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.