Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాషా సంస్కతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికష్ణ
నవతెలంగాణ-కల్చరల్
దేవతలుగా చెప్పేవారు కనిపించరని, కానీ కంటికి కనిపించే తల్లిదండ్రులు, గురువు ప్రత్యక్ష దైవ స్వరూపులు అని భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై భాషా సంస్కతిక శాఖ సౌజన్యంతో బర్మా స్వామి హచ్చులల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ 7 వార్షికోత్సవ సందర్భంగా మాత వందనం, గురు పూజ కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ మామిడి హరికష్ణ పాల్గొని మాట్లాడుతూ బంజారాలు దేశ సంస్కతిలో భాగమన్నారు. పిల్లలు తల్లిదండ్రుల కలల పంట అని, వారు ఎదిగి దేశానికి ఉత్తమ పౌరులు కావాలని ఆశిస్తారని అన్నారు. అధ్యక్షత వహించిన సంఖ్య శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులు రామ, లక్షణ సోదరులు సామాజిక సేవలో ముందు వరుసలో ఉండి ఆదర్శవంతంగా నిలిచారని అభినందించారు. వేదికపై వారి మాతమూర్తి గౌరీ, గురువు మీనాను సత్కరించారు. ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, మామిడి భీమ్ రెడ్డి, కొత్త కృష్ణవేణి, స్కౌట్స్ ప్రతినిధి విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగ ప్రముఖులను సత్కరించారు. కార్యదర్శి నాగరాజు నివేదిక సమర్పించారు.