Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలలా
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజల సమస్య పరిష్కారానికి అభివద్ధి లక్ష్యంగా, సంక్షేమ ఫలాన్ని అందించి మలక్‌పేట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. సైదాబాద్ డివిజన్ పరిసరాల ప్రాంతాల్లో డ్రయినేజీ, తాగునీటి సరఫరా, రోడ్డు రవాణా స్థానిక సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులదే తెలియజేశారు. సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాలనీ పరిశ్రమల ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. స్థానిక సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.