Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజన్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
- ప్రతి శుక్రవారం ఫ్రైడే.. డ్రై డే !
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
నవతెలంగాణ-మీర్పేట్
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్ కాలనీలో రూ. 85 లక్షలతో చేపట్టే తాగునీటి పైపులైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలలో నీటి సమస్యను శాశ్వత పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. నగర శివారు పట్టణ ప్రాంతాల్లో రూ. 1200 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నాయని చెప్పారు. పాత లైన్లు కూడా మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు ప్రతీ శుక్రవారం ఫ్రై డే.. డ్రై డే.. పేరుతో పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి వెను వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. మెయిన్ రోడ్డు విస్తరణ పనులు కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని వార్డుల్లోనూ చేపట్టే పనులపై ఒక కార్యాచరణ రూపొందించి, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పరుస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు ధనలక్ష్మీ రాజ్ కుమార్, ముద్ద పవన్ కుమార్, పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.