Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిలింనగర్ బీజేఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాథుడే లేడు
- ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గం బీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల15 రోజులుగా వరద నీటిలోనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. వరద ముంపునకు గురైన బీజేఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని గదులతో సహా ఆవరణ మొత్తం మోకాల్లోతు నీటితో నిండిపోయిందని, ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ విద్యాశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంఫై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కనీసం సోయి ఉందా అని ప్రశ్నించారు. ఓక్రిడ్జ్, డీపీఎస్ లాంటి అంతర్జాతీయ పాఠశాలలను ఆదరించి, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల విద్యార్థులు చదువుకునే సర్కార్ బడులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలోని నీటిని వెంటనే తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.