Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ టెక్నాలజీ కళాశాల, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ హైదరాబాద్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రయోజనం కోసం తలపెట్టిన లెక్చర్ సిరీస్‌ను సోమవారం ప్రారంభించారు. దీనికి ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ హైదరాబాద్ రీజినల్ సెంటర్ సెక్రటరీ, టెక్నాలజీ స్టూడెంట్ చాప్టర్ కోఆర్డినేటర్ డా. సాదం ఐలయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి లెక్చర్‌లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో టాప్ సైంటిస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఓయూ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థి ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ ప్రొ.హరిబాబు కెమికల్ ఇంజినీరింగ్ బహుముఖ వత్తి అనే అంశంపై ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. తన జీవన ప్రస్థానాన్ని, కెమికల్ ఇంజినీర్‌గా తన అనుభవాలు, సాధించిన విజయాలు తెలిపారు. భవిష్యత్తులో ఓయూ, ఆస్ట్రేలియా కర్టిన్ యూనివర్సిటీ పరిశోధనలో కలిసి పనిచేసేలా ఎంఓయూ కుదుర్చుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలు నివత్తి చేశారు.
ఓయూ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇది పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరిబాబు ఆస్ట్రేలియా కర్టిన్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఓయూ ఘనతను విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును అభినందించారు. ఓయూ టెక్నాలజీ కళాశాల ఇలాంటి ఎంతోమంది మేధావులను, పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడం గర్వంగా ఉందన్నారు. టెక్నాలజీ కళాశాలకు పూర్వ విద్యార్థులు చేస్తున్న కషిని కొనియాడారు. టెక్నాలజీ కళాశాల నూతన ఆవిష్కరణల కోసం కొత్త ఐడియాలకు ఆహ్వానం పలుకుతుంది అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ వి.వి. బసవరావు మాట్లాడుతూ హైదరాబాద్ రీజినల్ సెంటర్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి అన్నారు. టెక్నాలజీ కళాశాల కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ ప్రొ. వి. రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓయూ టెక్నాలజీ కళాశాల ప్రస్థానాన్ని, కెమికల్ ఇంజినీర్స్ వివిధ రంగాల్లో చేస్తున్న విశేష సేవలను వివరించారు. సమావేశంలో ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ హైదరాబాద్ రీజినల్ సెంటర్ చైర్మెన్ డా. సంజరు భరద్వాజ్, ఉల్హాస్ పార్లికర్, గంగయ్య, టెక్నాలజీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఆర్. శ్యామ్ సుందర్, డా.అల్తాఫ్ హుస్సేన్, దీపంకర్ దాస్, డా. టి. జ్యోతి, డా. పి. శ్రీ దుర్గ, టి.అజిత్, అనూష, మధువర్షిత, హాసిమ్, అనాజ్, సహజ, తరునిక, శ్రీవాణి, మహతాబ్, ఓయూ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థులు, ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.