Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-అడిక్‌మెట్
విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక (మాసా) ఆధ్వర్యంలో ౖ జులై 31న జరగనున్న దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్మిక సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం విద్యానగర్‌లోని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్‌గా తెచ్చిందన్నారు. ఫలితంగా కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె, వేతనాలు, బోనస్‌లు, ఇంక్రిమెంట్లు కోసం బేరసారాలాడే హక్కును కోల్పోతారని అన్నారు. శతాబ్దాలుగా పోరాడి అనేక త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చాలని ఈ కోర్స్ నిర్దేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకోవడానికి జులై 31న నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని కార్మికుల్ని కోరారు. సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి అనురాధ, మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పి శివ బాబు, గ్రామపంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కె. స్వామితదితరులు పాల్గొన్నారు.