Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
'సమస్యల వలయంలో ఓయూ లైబ్రరీ' అనే అంశంపై జులై 15న నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తక్షణమే లైబ్రరీలో ఊడుతున్న పెచ్చులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నిధులు కోసం ఆర్డర్స్ జారీ చేశారు. అమ్మాయిలకు కొత్తగా నాలుగు టాయిలెట్స్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇక్కడ ప్రధానంగా వేధిస్తున్న సమస్య వాటర్ సమస్య పరిష్కారం కావాల్సిన ఉంది. దానికి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరోవైపు పలు నోటిఫికేషన్ విడుదల చేసిన వేళా 24 గంటల లైబ్రరీ అందుబాటులో ఉంచాలని విద్యార్థులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.