Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సుప్రసిద్ధ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సేవల ప్రదాత ఏడీపీ ఇండియా తమ 23వ కంపెనీ డే వేడుకలను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించింది. కొవిడ్-19 కారణంగా రెండు సంవత్సరాలుగా రిమోట్‌గా వర్క్ చేస్తున్న 4వేల మందికి పైగా అసోసియేట్లు నిబద్ధత, సహకారం, వద్ధికి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వేడుక చేసుకునేందుకు ఏకమయ్యారు. ఉద్యోగులతో అనుబంధాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఏడీపీ ఇండియా యొక్క వార్షిక కంపెనీ డే, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా సంస్థ విజయాన్ని, సంస్ధ వద్ధిలో తోడ్పాటునందించిన అసోసియేట్ల తోడ్పాటును గుర్తించేలా వేడుకలను నిర్వహించింది.
భారతదేశంలో 1999లో 102 మంది అసోసియేట్లతో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 22 సంవత్సరాలలో ఏడీపీ అసాధారణంగా వద్ధి చెందడంతో పాటుగా 10500 మంది అసోసియేట్లతో కూడిన కుటుంబంగా మారింది. హెచ్సీఎంలో మార్కెట్ లీడర్‌గా, ఉద్యోగులు, తమ ఖాతాదారుల వద్ద ఒకే తరహా సంతప్తిని ఏడీపీ ఆస్వాదిస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమంలో, ఏడీపీ ఇండియా తమ వార్షిక వేడుకలను ముందుగానే ఆఫీసులో ప్రారంభించింది. ఆఫీసులో డెకరేషన్ చేయడంతో పాటుగా భౌతికంగా, వర్ట్యువల్‌గా క్విజ్‌లను ఏర్పాటుచేయడం, స్కావెంజర్ హంట్,సెల్ఫీ బూత్స్ మరియు మరెన్నో ఉత్సాహపూరితమైన కార్యక్రమాలను అసోసియేట్లతో నిర్వహించింది. ఈ పండుగ కార్యక్రమం ఏడీపీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాన్ఆయల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. హాజరైన ఉద్యోగులను చూసి తన సంతోషాన్ని వ్యక్తీకరించిన ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ విజరు వేములపల్లి మాట్లాడుతూ 'కొద్ది సంవత్సరాలుగా నేను కోల్పోయిన అంశం ఏదైనా ఉందా అని అంటే, మా ఏడీపీ కుటుంబంతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం. మా అసోసియేట్లు, క్లయింట్ల కోసం ఎల్లప్పుడూ మెరుగైన మార్గాలను రూపొందించాలనే ఏడీపీ లక్ష్యానికి మా అసోసియేట్లు జోడించే విలువ, హదయం, జీవితం, స్థిరత్వం, ప్రేమకు ఈ దశ్యం ఓ ఉదాహరణగా నిలుస్తుంది'అని అన్నారు.