Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా డివిజన్లోని మాధవపూరి, కృప విల్లస్లో వర్షాల కారణంగా రోడ్లు, డ్రయినేజీలు దెబ్బతిన్నాయి. దీంతో మంగళవారం కార్పొరేటర్ స్వర్ణరాజ్ ఏఈ ఆభిషేక్, వాటర్ వర్క్ ఏఈ రోహిత్‌తో కలసి ఆ ప్రాంతాలలో పర్యటించారు. మరమ్మతులకు గురైన రోడ్డు, డ్రయినేజీల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ గిల్బర్ట్, పవన్ కుమార్, అరవింద్ó, సూపర్వైజర్ ఆస్వని, వినరు,కప విల్లస్ అధ్యక్షుడు ప్రసాద్, సెక్రెటరీ మధు, కాలనీ వాసులు తదితరులున్నారు.