Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఐక్య విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-ఓయూ
పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు కొంత కాలంగా వినతిపత్రాలిచ్చినా, ఉద్యమించినా వీసీ స్పందించకపోవడంతో నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలు మంగళవారం ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొడంతో బంద్ సక్సెస్ అయింది. తమ పిలుపును అందుకొని బంద్‌కు సహకరించిన విద్యార్థులకు, ఉద్యోగులకు, పోలీసులకు ఐక్య సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. అనంతరం నాయకులు మాట్లాడుతూ... వీసీ సంస్కరణల పేరుతో విద్యార్థుల జీవితాలను అయోమయంలో పడేసే నిర్ణయాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాకల్టీ కొరతను సాకుగా చూపి పీహెచ్డీ కోర్సును ప్రయివేటు కాలేజీలకు అప్పగించడం, జేఆర్ఎఫ్ ఫెలోషిప్ విద్యార్థులకు అన్యాయం చేసేలా మెరిట్ ఆధారిత నియామక పద్ధతిని ప్రవేశ పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తున్నా నియంతలా వ్యవహరిస్తూ ఇబ్బందుల పాటు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తూ వీసీ తన ప్రయివేట్ సైన్యంతో, పోలీసులతో విద్యార్థులపై దాడులు చేయించారని ఆరోపించారు. ఇటువంటి నియంతృత్య చర్యల నేపథ్యంలోనే తాము బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. బంద్ నేపథ్యంలో ఓయూలో ఆర్ట్స్ కళాశాల, అడ్మినిస్ట్రేషన్ భవన్ ఎదుట, వివిధ ప్రదన కూడళ్ళలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.