Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జంట నగరాల కాపు కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 31న నిర్వహించబోయే కాపుల ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని కాప్రా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. మంగళ వారం కాప్రా సర్కిల్ పరిధిలోని కమలానగర్ కాపు భవన్లో ఆయన ఆత్మ గౌరవ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో ఆదివారం నిర్వహించే కాపుల ఆత్మ గౌరవ సభకు కాపు కుల బందువులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కులాల ఐక్యవేదిక కాప్రా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, ఉపాధ్యక్షులు జీవిఎన్ రావు, వైవి రాంబాబు, సెక్రటరీలు శేషు, ఉంగరాల నాయుడు, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.