Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు మహిళా ఖైదీలకు న్యాయ, ఆర్థిక సహాయం చేసి విడిపించినట్లు మూవ్మెంట్ ఫర్ జస్టిస్ (ఎంపీజే తెలంగాణ శాఖ) జనరల్ సెక్రెటరీ సలీముల్ హింద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షా కాలం ముగిసినప్పటికీ జరిమానా చెల్లించే ఆర్థిక స్థోమత లేక జైలులోనే గడుపుతున్న నిరుపేద, అభాగ్య మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచి న్యాయ సహాయం అందించి విడిపించామని తెలిపారు. ఎంపీజే రాష్ట్రంలోని వివిధ జైళ్లలోని అర్హులైన నిరుపేద ఖైదీలకు పూచీకత్తు చెల్లించే తగు ఏర్పాట్లు చేసి విడిపిస్తుందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం పురానీ హవేలీలోని ఎంపీజే ఆఫీసులో లేదా 040 24503818, 9010320638 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.