Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బంజారాహిల్స్
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ), సౌత్-ఈస్ట్ ఏషియా (ఎస్ఈ) సహకారంతో ఇన్సైట్-ఇంప్లిమెంటింగ్ ఇంటిగ్రేటెడ్ ప్యూపుల్, సెంటర్డ్ ఐ కేర్ ఇన్ సౌత్-ఈస్ట్ ఏషియా 2030 పేరుతో ప్రాంతీయ సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించారు. ఈసమావేశంలో జాతీయ కంటి ఆరోగ్య విధానాన్ని ప్రపంచవ్యాప్త తీర్మానం నిబద్ధతకు అనుగుణంగా మార్చడానికి, కంటి ఆరోగ్య సేవలను అందుకోలేకపోతున్న దష్టి లోపం కలిగిన వ్యక్తులను అంతిమంగా చేరుకునేందుకు ప్రణాళిక రచించడంపై చర్చ జరిగింది. 2030 లక్ష్యాన్ని చేరుకోవడానికి అభివద్ధి లక్ష్యాల రోడ్ మ్యాప్‌తో పాటు కంటి ఆరోగ్యాన్ని ఆరోగ్య వ్యవస్థ ప్రధాన స్రవంతిలో సమర్థవంతంగా అనుసంధానించడానికి సిఫార్సులు సూచనాత్మక కార్యాచరణ ప్రణాళికలు రూపొంచారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకత, లింగ సమానత్వం, కలుపుకుపోవడం, విద్యకు భారీ ప్రయోజనాలను అందిస్తుందని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, పబ్లిక్ హెల్త్ నెట్వర్క్, డ్కెరెక్టర్, డాక్టర్ రోహిత్ సి ఖన్నా తెలియజేశారు.