Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భారత కమ్యూనిస్టు పార్టీ ఉప్పల్ మండల మహాసభలో మండల కార్యదర్శిగా పి. రామ్ నారాయణ(రామంతపూర్), సహాయ కార్యదర్శిగా టి. సత్య ప్రసాద్(మల్లాపూర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ జీ. దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ మహాసభలో మొత్తం 16 మందిని కార్యవర్గ సభ్యులను, 30 మంది కౌన్సిల్ సభ్యులను నిర్మాణ పరంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా రంగాల నేతలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా దామోదర్ రెడ్డి, ధర్మేంద్ర, బొడ్డుపల్లి కష్ణ, పరమేష్,మల్కయ్య, స్వామి దాస్, బుచ్చి రెడ్డి, ఎం.నర్సింహా, సుగుణ, ఉషశ్రీ, సతీష్, భిక్షపతి, జాన్, ఐ. సాంబశివరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో 10తీర్మానాలను చర్చల ద్వారా ఆమోదించడమైనదని, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, డివిజన్లలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం, దళిత బంధు లబ్ధిదారులకు చెందడం కోసం పోరాటాలను చేయనున్నట్లు వారు ప్రకటించారు.