Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయాలి
- మనరజక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పెద్దఊరే బ్రహ్మయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయాలని మనరజక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పెద్దఊరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మనరజక సంఘం రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మయ్య హాజరై గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పగడాల శ్రీశైలం, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిళ్ల రమేష్, యూత్ ప్రెసిడెంట్‌గా పగడాల లక్ష్మణ్, యూత్ ప్రధాన కార్యదర్శి నాగిళ్ల సందీప్, యూత్ ఉపాధ్యక్షులుగా కొత్తపెళ్లి నరసింహారావు, ఎల్బీనగర్ ప్రధాన కార్యదర్శి దుప్పటి వీరేశం, జాయింట్ సెక్రెటరీ మరిపెద్దీ యాకయ్యను ఎన్నుకొని వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం బ్రహ్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకు కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సిఫార్సు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రయివేటు ధోబి పోస్టులు రజకులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లకు పైబడిన రజకులకు ప్రభుత్వ పెన్షన్ అందించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా అట్రాసిటీ చట్టాన్ని రజకులకు వర్తింపజేయాలన్నారు. ఐలమ్మ స్మారక భవనం ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రజక సబ్సిడీ రుణాలు అందించాలని సూచించారు. ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాల భూమి, ఐదు కోట్ల నిధులతో రజక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన గేట్ హైదరాబాద్ కమిటీని అభినందించి రజకుల సమస్యలపై నిరంతరం పోరాడాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రేట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గోవిందా మల్లేష్, ఉపాధ్యక్షులు పగడాల వెంకటేష్, ఇడింపల్లి రమేష్, ఎల్బీనగర్ అధ్యక్షులు పగ్గిళ్ల వెంకటేష్, మొగలిబాబు, బాతు రాజు, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.