Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నియామకాలపై వివిధ జిల్లాల నిరుద్యోగుల అభ్యర్థులు మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు విజయ నాయక్, కరణ్ మాట్లాడుతూ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో కొత్తగా ఏర్పడిన స్థానిక జిల్లాలను మాత్రమే పరిధిలో తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికన తీసుకోవడం వల్ల సింగరేణి ప్రాంత జిల్లాల లోకల్ అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. తక్షణమే సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సవరించాలని, సింగరేణి వ్యాప్త జిల్లాలను మాత్రమే లోకల్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. పరీక్షను తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఆన్లైన్ టెస్ట్ ద్వారా మాత్రమే నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో శశి కుమార్, శ్రీకాంత్, రాజేందర్, గణేష్ లవన్, శ్యామ్, శివాజీ, భాస్కర్ పాల్గొన్నారు.