Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు
- డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ-ధూల్‌పేట్
ల్యాబ్స్, పబ్లిక్ సెక్టార్ (బీడీఎల్, మిథానీ, డీఆర్డీఓ, ఏఎస్ఎల్, ఈఎంయూ, డీఎంఆర్ఎల్) తదితర కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. ల్యాబ్స్ అండ్ పబ్లిక్ సెక్టార్(సీఐటీయూ) క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈసర్వేలో వచ్చినా సమస్యలపై మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్డీఓ, మిథానీ, బీడీఎల్ తదితర కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, క్యాజువల్, డైలీ వెజ్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కాంట్రాక్టర్ ఇచ్చే వేతనాల్లో వ్యత్యాసాలకు పాల్పడుతుండడంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. బోనస్ జీఓల ప్రకారం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇతర వ్యక్తిగత సమస్య వల్ల నెల రోజులు విధులకు
రాకుంటే పని నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. కులం చూసి పనిలో తీసుకుంటున్నారని, ఇలా చేయడంం సరికాదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ల్యాబ్స్, పబ్లిక్ సెక్టార్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. నాగేశ్వరరావు, క్లస్టర్ కన్వీనర్ ఎస్. కిషన్, నాయకులు వి. రాంకుమార్, బాబా తదితరులు పాల్గొన్నారు.