Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే వేదికగా అన్ని సేవలు
- 4న ప్రారంభంకానున్న పోలీస్ టవర్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందల కోట్లతో నిర్మించిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో చర్చించారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లను పలువురు సీనియర్ అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులనూ పూర్తిచేయాలని ఆదేశించారు. చరిత్రాత్మక రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతోందని, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కమాండ్ సెంటర్ ప్రారంభోత్స వాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని, దీని ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను ఇనుమడింపచేయాలన్నారు. పోలీసు శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒకే వేదికగా పని చేయనున్నాయి. 18 అంతస్తులతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పాపులర్‌గా పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇన్స్టాల్ చేసిన సుమారు 9.25 లక్షల కెమెరాలను ఈ సెంటర్లో మానిటర్ చేయనున్నారు.