Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నాట్యం ఒక తపస్సు అని, దాన్ని నేర్పటం, నేర్చుకోవటం అందరకీ సాధ్యం కాదని ప్రముఖ నాట్య గురువు డాక్టర్ భాగవతుల సేతురాం అన్నారు. శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదికపై జీవీఅర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో ప్రముఖ నాట్య గురువు రేణుకా ప్రభాకర్‌కు ఆమె శిష్యులు గురు సత్కారంగా స్వర్ణ కంకణం బహుకరణ ప్రదానోత్సవం ఆత్మీయంగా జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ సేతురామ్ పాల్గొని మాట్లాడుతూ రేణుక ప్రతిభావంత నాట్య కళాకారిణి, గురువు అని అభినందించారు. శిష్యులు గురువుని సత్కరించటం కనుమరుగువుతున్న కాలంలో గురుశిష్య పరంపర కొనసాగించటం ముదావహం అన్నారు. ఆంధ్ర నాట్య గురువు డాక్టర్ కళా కష్ణ మాట్లాడుతూ రేణుక శిక్షణలో వందల శిష్యులు నాట్య కళాకారినులుగా రాణిస్తారని కొనియాడారు. నాట్య గురువు ప్రసన్న రాణి, కళా పోషకుడు బొప్పన నరసింహారావు, హమీద్ తదితరులు పాల్గొన్న సభకు కళా పోషకులు చిల్ల రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. నిర్వాహకుడు వెంకట రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమానికి తొలుత రేణుక శిష్య బందం కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.