Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎంఎస్ఐటీడీసీ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- ఫీవర్ ఆస్పత్రి ఓట్ పేషంట్ బిల్డింగ్ పనుల పరిశీలన
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఎస్ఎంఎస్ఐటీడీసీ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో చేపడుతున్న ఔట్ పేషంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రయివేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డీఈ లక్ష్మీ నరసయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.