Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బయటకు వెళ్లే మార్గం ద్వారా కాకుండా లోపలికి వెళ్లే మార్గం ద్వారా ఆలయంలోకి రావాలని చెప్పినందుకు దుర్భాషలాడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబర్‌పేట మహంకాళి దేవస్ధాన సేవా సమితి అధ్యక్షుడు జనగాం సత్తిబాబుగౌడ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తిబాబుగౌడ్ మాట్లాడుతూ బోనాల పండుగ రోజు బాగ్ అంబర్‌పేట నందనవనం కాలనీలో నివాసం ఉండే బాసాని శ్రీనివాస్ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు బయటకు వెళ్లే దారి నుంచి వస్తుండగా దేవస్ధాన సేవా సమితి కమిటీ సభ్యులైన పంజాల చంద్రశేఖర్‌గౌడ్ ఆలయం లోపలికి వచ్చేందుకు మూడు దారులు ఉన్నాయని లోపలికి వెళ్ళే మార్గం ద్వారా కాకుండా బయటకు వెళ్ళే మార్గం ద్వారా వస్తున్నారని అతనికి చెప్పారు. ఈ విషయంపై బాసాని శ్రీనివాస్ దుర్భాషలాడుతూ చంద్రశేఖర్‌గౌడ్‌ను తిట్టడం జరిగిందన్నారు. సరైన మార్గాంలో రావాలని సూచించినందుకు దుర్భాషలాటడమే కుకుండా అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కమిటీ తరపున బాసాని శ్రీనివాస్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి చంద్రశేఖర్‌ను దూషించిన బాసాని శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.