Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ జోన్ సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ల కేటాయించాలని సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ జోన్ కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. అర్జీలు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. గురువారం యూసుఫ్గూడా డివిజన్ కష్ణానగర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది నిరుపేదలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్జీలు పెట్టుకున్నారని, అయితే ఇంతవరకు ఒక్కరికి కూడా ఇండ్లు కేటాయించలేదన్నారు. నూతనంగా అర్జీలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1న ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద చేపట్టే భారీ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రఘు, నాయుడు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.