Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు భాష కవిత్వంలో రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి భావకవుల తర్వాత సంప్రదాయ భావ కవిత్వంతో పాటు సామాజిక అంశాలను మేళవించి కవితలల్లిన ఆధునిక యుగ కవి సినారె అని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ చైర్మెన్ బుద్ద మురళి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గానసభ ఆధ్యర్యంలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బుద్ద మురళి పాల్గొని మాట్లాడుతూ సినారె అందుకోని పురస్కారాలు లేవని రాజ్యసభ్యుడుగా, తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా, ప్రొఫెసర్గా వివిధ పదవులను అధిష్టించి ఆ పదవులకు న్యాయం చేశారని వివరించారు. మానవత, సమత ఆయన కవితల సందేశం అని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గానసభతో తమ తండ్రి సుబ్బారావు సోదరుడు దీక్షితులుతో సినారె అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేదికపై సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, నటుడు మానిక్లు సినారెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భమిడిపాటి ఉషా, సత్యనారాయణ మూర్తి పాల్గొన్న సభకు బండి శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.