Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవాల్ విసిరిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు
నవతెలంగాణ-ఓయూ
బీజేపీకి వత్తాసు పలుకుతున్న కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు సవాలు విసిరారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఓయూ వేదికగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో అభివద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే దమ్ము ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొమ్ము కాస్తున్న విద్యార్థి సంఘాల నాయకులకు ఉందా అని ధ్వజమెత్తారు. కటిక పేదరికం, ఎన్నో కష్టాలు ఎదుర్కొని విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ తెలంగాణ సాధనలో తనదైన చురుకైన పాత్ర పోషించిన బాల్క సుమన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని సీనియర్ నాయకులు బోయిళ్ళ విద్యాసాగర్ హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేష్, వెంకట్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు బూర నవీన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బొల్లు నాగరాజు యాదవ్, భార్గవ్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.