Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కన్న మాదన్న ఆలయ కమిటీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఇటీవల బోనాల పండుగ జాతర సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వేదికపై బి.వెంకటస్వామి చిత్రపటాన్ని తొలగించడాన్ని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ, బి.వెంకట స్వామి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గురువారం హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్దన మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల భారత్ ప్రకాష్ మాట్లాడుతూ బోనాల జాతర కో ఆర్డినేషన్ కోసం 1970లో మూడు ఆలయాలతో ఏర్పాటు చేసిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నేడు 25 ఆలయాలకు చేరిందని అన్నారు. దీనికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులు కూడా రొటేషన్ పద్దతిలో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ కొంత కాలంగా ఒక ఆలయానికి చెందిన వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం ఎవరు అధ్యక్షులు అయిన తనే అని అటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీనీ ఇటు ప్రభుత్వ అధికారులను మంత్రులను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అస్థిత్వావానికి మచ్చ తెస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత నగరంలో బోనాల ఉత్సవాలు జరుపుకోవడం కోసం ఎంతో కషి చేసిన పెద్దలు దివంగత బి.వెంకట స్వామి చిత్రపటం చార్మినార్ ముఖ్య వేదిక వద్ద ఆయన గౌరవార్థం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ ఈ సోమవారం జరిగిన బోనాల ఘట్టాల ఊరేగింపు వేదిక పై పెట్టిన ఆయన చిత్రపటం ఎందుకు తీసివేశారని ఆయన ప్రశ్నించారు. ఇలా ఒంటెత్తు, ఏకపక్ష నిర్ణయాలతో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీకి మచ్చ తేవడం సొంత పబ్లిసిటీ కోసం బోనాల పండుగ జాతర కోసం కషి చేసిన పెద్దల చిత్రపటాలను తొలగించడం సరికాదన్నారు. ఆలయ కమిటీ సలహాదారులు జి.రాజారత్నం, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎం.కష్ణ, మాదసు వినోద్ కుమార్, డి.అర్.ప్రభాకర్, ఏ.సతీష్ కుమార్, జి.దినేష్, జి.రాజు, ముఖేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.