Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. ఆర్. లింబాద్రి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారే రాణించగలుగుతారని చెప్పారు. విద్యార్థులు ఆ దిశగా కషి చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్సు కళాశాల రసాయనిక శాస్త్రం (కెమిస్ట్రీ విభాగంలో) 'కరెంట్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ చాలెంజెస్ ఇన్ కెమికల్ సైన్సెస్' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్‌ను శుక్రవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొ. లింబాద్రి హాజరై ప్రసంగించారు. సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు విద్యార్థులకు ఎంతగానో పరిశోధన శక్తిని పెంపొందిస్తాయన్నారు. రసాయన శాస్త్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలను చర్చించడంతో పాటు రాబోయే చాలెంజెస్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చర్చించేందుకు సెమినార్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నాణ్యమైన పరిశోధనలు చేసి మానవాళికి మేలు జరిగేలా చూడాలని కోరారు. ఓయూ వీసీ ప్రొ. రవీందర్ మాట్లాడుతూ. పూర్వ విద్యార్థుల సహకారంతో కెమిస్ట్రీ విభాగంలో చేసిన అభివద్ధిని ప్రశంసించారు. అన్ని విభాగాలు కెమిస్ట్రీ విభాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సదస్సు కన్వీనర్, కెమిస్ట్రీ విభాగం హెడ్, కన్వీనర్ ప్రొ. యు. ఉమేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 241కు పైగా పరిశోధనా పత్రాలు వచ్చాయని చెప్పారు. సదస్సులో భాగంగా ఒక కీలకోపన్యాసం, 7 ప్లీనరీ సెషన్స్, 10 ఇన్వైట్ లెచ్చర్స్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో అతిథి ఉపన్యాసాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరిశోధకులు ఓరల్, పోస్టర్ ప్రజెంటేషన్లు చేస్తారన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ డీన్ ప్రొ. అశ్విన్ నాంగియా, ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ ఫౌండేషన్ (ఓయూసీఎఫ్) ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్ రెడ్డి, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. వీరయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ ప్రొ. పి.లీలావతి, కో కన్వీనర్ ప్రొ. పీవీ. అనంత లక్ష్మి, డా.హరి పద్మశ్రీ, మాజీ వీసీ ప్రొ.సత్యనారాయణ, ఔట అధ్యక్షుడు ప్రొ.మనోహర్, అధ్యాపకులు ప్రొ. మురళీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కవిత, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధులు, పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.