Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీను టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ సీఈఓ కావ్యశ్రీ
నవతెలంగాణ-హైదరాబాద్
త్వరలో రాజకీయరంగంలో కూడా డిజిటల్ సేవలను ప్రారంభించనున్నట్టు శ్రీను టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్ (ఎస్ టీపీఎల్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ సీఈఓ చిల్కా కావ్యశ్రీ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో డిజిటల్ సేవలను ఉపయోగించడం పెరిగిందని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్‌లో మంచి అనుభవం, డిజిటల్ రంగ నిపుణులు, మార్కెట్ వ్యూహం గల తమ సంస్థ ఇప్పటికే అనేక సేవలను అందజేస్తుందని పేర్కొన్నారు. తమ సేవలను మరింత విస్తరిస్తామనీ, వెబ్సైట్, యాప్ డెవలప్మెంట్, నిపుణులతో గ్రాఫిక్ డిజైన్, తదితర డిజిటల్ సేవలను అందించనున్నామని కావ్యశ్రీ తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.