Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ జోన్ సీఐటీయూ మహాసభను రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించారు. ఈ మహాసభకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేష్, నగర నాయకులు పుల్లారావు హాజరై మాట్లాడుతూ రాబోయే మూడు సంవత్సరాలకు జోన్ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని మహాసభలో నిర్ణయించారు. అనంతరం మహాసభ నూతన కమిటీని 21 మందితో ఏర్పాటు చేశారు. జోన్ కన్వీనర్‌గా జే స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సాయి శేషగిరిరావు, నరసింహ, బాలు, సోమేశ్, లక్ష్మణ్, దేవదాసు, పార్వతమ్మ, సమాధానం, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.