Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధార్థ హౌసింగ్, సాయి అన్నపూర్ణ ఎన్నారై పేరెంట్స్ కమిటీ
నవతెలంగాణ-బంజారాహిల్స్
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఇల్లు కానుకగా ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోంకు స్వస్తి పలికేందుకు సిద్ధార్థ హౌసింగ్, సాయి అన్నపూర్ణ ఎన్నారై పేరెంట్స్ కమిటీ ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని సంస్థ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, ధనలక్ష్మీ రత్నకుమారి మాట్లాడుతూ వత్తిరీత్యా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న ఎన్నారైలు తమ తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలతో ఇంటిని నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని సేవా దక్పథంతో చేపట్టామని చెప్పారు. మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో తొలిసారిగా ఈ సాహసాన్ని చేస్తున్నామని వారు వివరించారు. హైదరాబాద్ షాద్‌నగర్ దగ్గర బాల్నగర్ బెంగళూరు వైపు దగ్గరలో ఉన్న 100 ఎకరాల మెగా హౌసింగ్ ప్రాజెక్టులో పేరెంట్స్ కోసం ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వస్తున్నామన్నారు. తాము ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టులో 330 గజాల ఫ్లాట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేరెంట్స్‌కి 500 ఎస్‌ఎఫ్‌టిలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఉచితంగా కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశం మొదటి వంద మందికి మాత్రమే కల్పిస్తున్నామన్నారు. మరో వెంచర్ ముంబాయి హైవేకి 5 కిలోమీటర్ల పరిధిలో 165 చదరపు గజాల్లో 750 ఎస్ఎఫ్టీలో రూ. 27 లక్షలకు సింగిల్ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం 9515625461 నంబర్‌ను సంప్రదించాలని వారు సూచించారు.