Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సామాజిక, సేవా, ధార్మిక కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు తరచూ పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మెన్ వుప్పల శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ సూచించారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై ప్రపంచ ఆర్య వైశ్యమహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫార్మ్ ఆధ్యర్యంలో ప్రణవ పీఠాధిపతి, త్రి భాషా సహస్ర అవధాని మద్ధిపర్తి పద్మాకర్ చే హనుమాన్ మహిమ రెండురోజుల ప్రవచనం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా దామోదర్, శ్రీనివాస్ పాల్గొని సంస్థ లోగోను ప్రవచన కర్త పద్మాకర్తో కలసి ఆవిష్కరించారు. ఫోరం చైర్మెన్ వూర బాబూ రావు స్వాగతం పలుకుతూ పద్మాకర్ ప్రసంగం విజ్ఞాన యుతమని అందరూ సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు. వేదికపై ఫార్మ్ కార్యదర్శి రామయ్య, కోశాధికారి రామా రావు, సలహాదారు చింతల శ్రీనివాస్, ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. పద్మాకర్ తన ప్రసంగంలో ఆత్మహత్య వల్ల సమస్యలు పరిష్కారం కావనీ, బతికి ఉన్నవారిని మరిన్ని సమస్యలు వెంటాడుతాయని అన్నారు. జీవితమంతా కష్టపడినా సమస్యలు కలకాలం ఉండవని, జీవితంలో సుఖాలు ఏదో సమయంలో వస్తాయని ఆయన వివరించారు.