Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌత్ జిల్లా హమాలీ యూనియన్ సీఐటీయూ అధ్యక్షులు పి చెన్నయ్య
నవతెలంగాణ-ధూల్‌పేట్
హమాలీలకు ప్రకటించిన వెల్ఫేర్ బోర్డ్‌ను తక్షణమే అమలు చేయాలని సౌత్ జిల్లా హమాలి యూనియన్ సీఐటీయూ అధ్యక్షులు పి చెన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కిషన్ గంజులోని సీఐటీయూ కార్యాలయంలో సౌత్ జిల్లా కార్యదర్శి పి నాగేశ్వర్ నేతత్వంలో హమాలీ యూనియన్ నాయకులతో కలిసి చలో ధర్నా చౌక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల చట్టాలను అమలుపరచడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించాలని వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికుల సమస్యలపై ఈనెల 3వ సీఐటీయూ చేపట్టిన చలో ధర్నా చౌక్ కార్యక్రమాన్ని హమాలి కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు మోహన్, తయప్ప, ఉప్పలయ్య, అంజయ్య, నారాయణ, బుగ్గన, గణపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.